
'ఫెన్నీ మే' నుంచి 200 మంది తొలగింపు.. తెలుగోళ్లే ఎక్కువ
అమెరికా గృహ ఆర్థిక సంస్థ ఫెన్నీ మే "నైతిక కారణాలతో" సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు వెల్లడించాయి. వీరిలో ఎక్కువ తెలుగువారే. ఉద్యోగులు సంస్థ నిర్వహించే మ్యాచింగ్ గిఫ్ట్ ప్రోగ్రామ్ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కాంలో TANA, ATA ప్రమేయం ఉన్నట్లు సమాచారం. దీనిపై భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు సుహాస్ సుబ్రహ్మణ్యం స్పందించి, న్యాయమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు.