జగిత్యాల జిల్లా మల్యాల మండల కొండగట్టు మారుతి టౌన్షిప్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పదంగా యువకుడు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. కొడిమ్యాల మండలం రాంసాగర్ గ్రామానికి చెందిన శేఖర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి సీఐ నీలం రవి, ఎస్ఐ నరేష్ చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.