జగిత్యాల: బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి

62చూసినవారు
జగిత్యాల: బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి
బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని భారత్ సురక్ష సమితి నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాలలో గురువారం వారు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. అనేక జిల్లాలలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఒక సామాజిక వర్గం వారు ఆందోళనలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ రాజు, పుప్పాల సత్యనారాయణ, చిట్ల గంగాధర్, సింగం గంగాధర్, వేముల పోచమల్లు, నరేందుల శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్