ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ జగన్నాథ రథయాత్రను మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావసంత సురేష్ గురువారం ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథయాత్ర పట్టణంలోని టౌన్ హాల్ నుండి ప్రారంభమై పురవీధుల గుండా శోభాయమానంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హరే రామ, హరే కృష్ణ అంటూ భక్తి పారవశంగా పారాయణం చేశారు.