జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో దుంపేట రాజేశం ఏఎల్ఎం గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం తన పనిలో భాగంగా వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లే విద్యుత్ లైన్ ఆఫ్ చేసి పని చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కరెంట్ లైన్ ఆన్ చేయడంతో రాజేశం కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.