రేపటి నుంచి అమల్లోకి కొత్త చట్టాలు

83చూసినవారు
రేపటి నుంచి అమల్లోకి కొత్త చట్టాలు
జూలై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు-2023 అమలులోకి రానున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. అమల్లోకి రానున్న కొత్త చట్టాలు మనదేశ అంతర్గత భద్రతలో నూతన శకాన్ని ప్రారంభించనున్నాయన్నారు. ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతులలో మార్పు వస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్