పవన్ కళ్యాణ్ పర్యటనలో దొంగల చేతివాటం

76చూసినవారు
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఏపీ ఉప ముఖ్య మంత్రి, ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ అంజన్నను శనివారం దర్శించుకున్నారు. అయితే భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఇదే అదనుగా భావించిన దొంగలు పలువురి నగదు, బంగారు చైన్ లు దొంగిలించారు. ఓ దొంగ జేబు కొడుతోండగా స్థానికులు పట్టుకుని దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దొంగ వద్ద నుండి ఐదు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్