జనాభా పెరుగుదలే పేదరికానికి ప్రధాన కారణమని, జనాభా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. డి. సమియోద్దిన్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జగిత్యాలలోని ఐఎంఏ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారులు డా. ఎ. శ్రీనివాస్, డాక్టర్ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.