ఆటో ట్రాలీ మినీ గూడ్స్ ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని కరీంనగర్ లో ఎన్నుకున్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ లో శుక్రవారం జరిగిన సంబరాలకు కాంగ్రెస్ అసెంబ్లీ మాజీ ఇంచార్జ్ పురుమల్ల శ్రీనివాస్ హజరై కేక్ కట్ చేశారు. అద్యక్షుడిగా లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్, కోశాధికారి నరేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెంకట్ ఎంపికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందని శ్రీనివాస్ అన్నారు.