గోదావరిఖని కి చెందిన వేముల రాజేశ్వరి ఆరోగ్యం క్షీణించి కరీంనగర్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. హార్ట్ సర్జరీ అత్యవసరంగా బ్లడ్ కావాలని మున్సిపల్ బిల్ కలెక్టర్ రామకృష్ణ కు తెలుపగా వెంటనే స్పందించి అపోలో హాస్పిటల్ కి వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 37 వ సారి రక్తదానం చేయడం జరిగింది అని తెలిపారు. ఆపద సమయంలో ఎల్లవేళలా 8897943398 ఈ నెంబర్ కు ఫోన్ చేయగలరని వచ్చి రక్తదానం చేస్తాను అని తెలిపారు.