కరీంనగర్ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గంజాయి చాక్లెట్స్ కలకలం రేపాయి. ఇద్దరు వ్యక్తులు గంజాయి చాక్లెట్స్ అమ్మడానికి రాగా పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసులు విచారించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 3 వేల విలువైన 1. 460 కేజీల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు లభించాయని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గౌతమ్ కుమార్, బాబల్ను మంగళవారం అరెస్ట్ చేశారు.