కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో నవాబుపేట అంగన్వాడి కేంద్రాలలో ఈ రోజు పోషణ్ పక్వాడ్ కార్యమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా బాలింతలు, చిన్న పిల్లలకు ప్రీ స్కూల్ మేళా నిర్వహించారు. ఈ సందర్బంగా పల్లె దావఖాన వైద్యురాలు డాక్టర్ లక్ష్మి ప్రసన్న కిషోర బాలికలు, బాలింతలు, గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్య స్థితి గురించి తెలుసుకొని ఆరోగ్య సూచనలు చేశారు.