చిగురుమామిడి: నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకుడు

1చూసినవారు
చిగురుమామిడి: నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకుడు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ సాయికృష్ణను శనివారం కాంగ్రెస్ మండల నాయకుడు బోయిని ప్రశాంత్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎస్సై సాయి కృష్ణ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలన్నారు. మాదక ద్రవ్యాల నివారణకు నిరంతర పర్యవేక్షణ ఉందని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.