చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నడిగొట్టు తిరుపతి భార్య సంధ్యారాణి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా శనివారం గంగాధర తహశీల్దార్ అనుపమరావు ఇందుర్తిలోని వారి గృహంలో తిరుపతి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంధ్యారాణి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు మనోధైర్యం చెప్పారు.