డ్రగ్స్ నియంత్రణపై కలెక్టర్ అవగాహన

72చూసినవారు
డ్రగ్స్ నియంత్రణపై కలెక్టర్ అవగాహన
అధికారులు, ప్రజలు అందరం కలిసి డ్రగ్స్ అనే మహమ్మారిని జిల్లా నుంచి తరిమికొడదామని, డ్రగ్స్ రహిత జిల్లాగా తయారు చేద్దామని కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణపై ఎక్సైజ్శాఖ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ అవగాహన సమావేశం నిర్వహించారు. యువత డ్రగ్స్, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యసనాల బారిన పడి యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్