కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశానికి హాజరయ్యారు. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు, ప్రజాపాలన, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి పలుసూచనలు చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సీఎం సూచించారు.