మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కరీంనగర్కు చెందిన దామర కొండ సంతోష్ను నియమించారు. నగరంలోని మంకమ్మతోట మీకోసం కార్యాలయంలో రాష్ట్ర మున్నూరుకాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ చేతుల మీదుగా నియామక పత్రాలను శుక్రవారం అందజేశారు. తన నియమకానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఏప్రిల్ 13న నెక్లెస్ రోడ్ జలవిహార్లో మున్నూరు కాపు సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.