కరీంనగర్ రాఘవేంద్రనగర్ లో శుక్రవారం ఓ ఇంట్లో గ్యాస్ లీకేజ్ వల్ల ఒక్కసారి మంటలు చెలరేగాయి. కోడూరు వేణు ఇంట్లో సంక్రాంతి పండుగ కోసం పిండివంటలు చేస్తున్న క్రమంలో గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించగా, సిబ్బంది వచ్చేలోపే స్థానికుల సహాయంతో కుటుంబసభ్యులు బెడ్ షీట్స్ను తడుపు కుంటూ సిలిండర్ పై వేసి మంటలను అదుపు చేశారు. ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి.