కరీంనగర్ నగర శివారులోని రేకుర్తి లక్ష్మీనరసింహస్వామి ఆలయగుట్ట వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం సమయంలో గుర్తుతెలియని ఆకతాయిలు నిప్పుపెట్టి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఇది గమనించిన బ్లూకోల్ట్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ప్రమాదస్థలికి చేరుకుని మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.