
గుజరాత్లో దారుణం.. బస్సు ఢీకొని నలుగురు మృతి
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు సిగ్నల్స్ దగ్గర కూడా ఆగకుండా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు రోడ్డు మీద ఉన్నవారిని ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం ప్రకారం బస్సుకు బ్రేక్స్ ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.