కరీంనగర్కు చెందిన నలుగురు మైనర్ బాలికలు ఇంటి నుంచి వెళ్లిపోయారని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వారిని గుంటూరు రైల్వేస్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. క్షేమంగా కరీంనగర్కు తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పజెప్పినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఫోన్ చూడొద్దని మందలించినందుకు ఇంటి నుంచి వెళ్లినట్లు సమాచారం.