కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ లోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న ఆషాఢమాసం శాకంబరీ ఉత్సవాలలో భాగంగా శనివారం శ్రీ దుర్గాభవానీ అమ్మవారిని ఆలుగడ్డలు, కరివేపాకు మాలలతో అలంకరించారు. అమ్మవారికి ఆలయ పూజారులు విశేష హారతులు, ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం, చీరసారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొన్నారు.