కరీంనగర్: భక్తాంజనేయ ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం

80చూసినవారు
కరీంనగర్ మంకమ్మతోట భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ దీక్షా స్వాముల ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఆలయ ఆవరణలో స్వాములు, భక్తులు 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా భక్తిపారవశ్యంలో మునిగి తేలింది. కార్యక్రమంలో ఆలయ ప్రధాన సేవకులు లోకేందర్, ప్రసాద్, రవీందర్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్