వెంటనే హాస్టల్ అద్దె బకాయిలు చెల్లించాలి: శ్రీనివాస్

73చూసినవారు
కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ బీసీ హాస్టల్ భవనాల అద్దె బకాయిలను, విద్యార్థుల మెస్ ఛార్జీలను విడుదల చేయాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. విద్యార్థులకు 5 నెలల నుంచి మెస్ ఛార్జీలు రావడం లేదన్నారు. మూడేళ్ల నుంచి బీసీ హాస్టల్ అద్దె భవనాలకు బకాయిలు చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్