హైదరాబాదులో కలెక్టర్లతో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, కరీంనగర్ కలెక్టర్ పమేళా సత్పతి పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాల అమలు, లబ్ధిదారుల జాబితా తయారీ తదితర వాటిపై సీఎం దిశా నిర్దేశం చేశారు.