కరీంనగర్: సహకార సంఘాల ప్రతినిధులకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు

58చూసినవారు
కరీంనగర్: సహకార సంఘాల ప్రతినిధులకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
భూభారతి చట్టం ప్రాముఖ్యతను వివరించేందుకు సహకార శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం  అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఆర్డీవో కె. మహేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భూభారతి చట్టం ద్వారా భూ రికార్డుల ఆధునీకరణ, పారదర్శకత, ప్రజలకు సులభంగా భూ సమాచారం అందుబాటులోకి రావడం వంటి అంశాలపై చర్చించారు. ఈ అవగాహన సదస్సులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్