కరీంనగర్ లోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా ఎంజీఆర్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ విద్యా సంస్థల నుండి దాదాపుగా 31 మంది అధ్యాపక బృందం రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చైర్మన్ డా. పి. ఫాతిమా రెడ్డి మాట్లాడుతూ ఈ రక్తదానం అనేది మన శరీరానికి మంచిదని, రక్తదానం చేయడం వలన ఎన్నో లాభాలు ఉంటాయన్నారు.