

ఐస్క్రీమ్లో చనిపోయిన బల్లి ప్రత్యక్షం (వీడియో)
ఇటీవల కాలంలో ఆహారపదార్థాల్లో చినపోయిన బల్లి, ఎలుక, బొద్దింక వంటివి ప్రత్యక్షమవుతున్న ఘటనలు చూశాం. తాజాగా గుజరాత్లోని అహ్మదాబాద్లో ఐస్క్రీమ్లో బల్లి తొక రావడం కలకలం రేపింది. ఓ మహిళ మునిన్నగర్ లో Havmor ఐస్క్రీమ్స్ కొని ఇంటికెళ్లి తింటుండగా బల్లి కనిపించింది. దీంతో ఆమె కడుపునొప్పి, వాంతులతో ఆస్పత్రిలో చేరారు. సదరు మహిళ మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు యజమానికి రూ.50వేల ఫైన్ వేసి, షాపును సీజ్ చేశారు.