కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి జన్మదినోత్సవాన్ని నవాబుపేట గ్రామ బస్టాండ్ చౌరస్తాలో పార్టీ నాయకులు శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్యకర్తలు మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.