కరీంనగర్ జిల్లా కేంద్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి కావడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. విష్ణునామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారు జాము నుంచే వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీ శ్రీరామ్ నగర్ లోని శ్రీరామ మందిరం ఆలయానికి భక్తులు పోటెత్తారు.