కరీంనగర్ శివారు లోయర్ మానేరు డ్యాంలో ఉన్న నీరు తగ్గడంతో పురాతన ఆలయాలు, గ్రామాలు బయటపడ్డాయి. అయితే పురాతన ఆలయాల సమీపంలో ఉన్న పెద్ద పెద్ద రాళ్లను గుప్త నిధుల ముఠా తొలగించి సుమారు 5 మీటర్ల మేర తవ్వకాలు చేసారు. జంతువులను కూడా బలిచ్చినట్లు సమాచారం. ఎక్కడ తవ్వకాలు చేయడంతో సమీపంలోని రైతులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానితులు సంచరిస్తే తమకు సమాచారం అందించాలని స్థానికులకు తెలిపారు.