కరీంనగర్ జిల్లా వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన బొడిగె కరుణాకర్(35) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఎంజిఎం కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మంగళవారం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిహెచ్ తిరుపతి తెలిపారు.