కరీంనగర్ నగరంలో ప్రతిమ మల్టీప్లెక్స్ కూడలి వద్ద ఓ వ్యక్తి హల్చల్ చేశారు. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి రోడ్డు మధ్యలోకి వచ్చి ఒంటిపై ఉన్న బట్టలు విప్పి రోడ్డుపై నిల్చొని వాహనదారులకు ఇబ్బందులకు గురిచేశారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తిని పక్కకు తీసుకువెళ్లి బట్టలు తొడిగించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి పంపించారు.