కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో ఆదివారం శాలివాహన కుమ్మర యూత్ సంఘం సమావేశం ఏర్పాటు చేసుకొని సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఎనగంటి విజయ్, ఉపాధ్యక్షునిగా గొల్లపెల్లి అరుణ్, ప్రధాన కార్యదర్శిగా ఎనగంటి శ్రీకాంత్, కోశాధికారిగా గొల్లపెల్లి నవీన్ లను సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.