కరీంనగర్: అత్యాచార నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష

60చూసినవారు
కరీంనగర్: అత్యాచార నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష
బాపట్ల జిల్లా చిలుకపాడుకు చెందిన దాసరి అంజి కరీంనగర్ జిల్లాకు చెందిన బాలికను అత్యాచారం చేశాడు. కేసును విచారించిన కరీంనగర్ పోక్సో కోర్టు జడ్జి వెంకటేశ్ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10, 000 జరిమానా విధించారు. అంజి పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి 2013లో అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు 2016లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరం రుజువవ్వడంతో శుక్రవారం కోర్టు తీర్పునిచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్