కరీంనగర్‌: సార్వత్రిక సమ్మెకు సైరన్‌

0చూసినవారు
కరీంనగర్‌: సార్వత్రిక సమ్మెకు సైరన్‌
బీజేపీ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ వ్యతిరేక, నిరంకుశ విధానాలకు నిరసనగా ఈ నెల 9న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్నది. ఆందోళనలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు రంగాలకు చెందిన సంఘటిత, అసంఘటిత కార్మికులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు సుమారు 3.50 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉండగా, వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలతోపాటు బీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం కూడా పాల్గొంటున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సై అంటున్నారు.

సంబంధిత పోస్ట్