జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు కేశపట్నం మండల కేంద్రంలోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. మంచి ప్రతిభ కనబరిచిన మొదటి ఆరుగురి విద్యార్థులకు బహుమతులను ప్రిన్సిపాల్ వి. సరిత చేతుల మీదుగా ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ బహుమతులు అందజేశారు.