కొత్తపల్లి పట్టణ కేంద్రంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, దేశ ఐక్యతకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ పట్టణ 49వ బూత్ లో బూత్ అధ్యక్షులు మెరుగు మల్లేశం ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించి బూత్ లో మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.