కరీంనగర్ ను స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ శుక్రవారం పిలుపునిచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల వల్ల ప్రజలు సీజనల్ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నదని జిల్లా ప్రజలందరు అప్రమత్తతతో, ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ఇంటి చుట్టు, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం మనందరి బాధ్యత అన్నారు.