కరీంనగర్ శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద జంతువుల కళేబరాలు నిల్వచేసే స్థావరాలను ఏర్పాటు చేయడంతో స్థానికులు అడ్డుకుని పోలీసులకు పట్టించారు. ఇటీవల దుర్వాసన వస్తుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు కళేబరాన్ని నిల్వచేసే స్థావరాన్ని గుర్తించారు. గురువారం సాయంత్రం కళేబరాలను తీసుకొస్తున్న ఆటోను పట్టుకుని, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వారు చేరుకుని ఆటోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.