నేడు (శుక్రవారం) కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు సాయంత్రం 4:00 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సు, గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం, ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమంలో పాల్గొంటారు.