ముక్కోటి ఏకాదశి ఉత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం క్యూ లైన్ లలో నిలబడి దర్శనాన్ని చేసుకుంటున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మరియు ప్రజా ప్రతినిధులు మంచి వసతులు కల్పించారు.