కరీంనగర్లో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సభ ఉత్సవాల్లో సోమవారం ప్రజా సంఘాల నాయకురాలు శారద నిరసన తెలిపారు. వేదికపైకి ఆహ్వానించలేదని కింద కూర్చొని నిరసన తెలిపారు. దీన్ని మీడియా కవర్ చేస్తుండగా. ప్రజా సంఘాల ఛైర్మన్ గజ్జల కాంతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మీడియా ప్రతినిధులు ఆయనకు ఎదురుతిరిగారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి చొరవ తీసుకుని గొడవను సద్దుమణిగించారు.