కరీంనగర్ అన్నపూర్ణ కాంప్లెక్స్లో రాజస్థాన్ వ్యాపారులకు వ్యతిరేకంగా మొబైల్ షాపుల నిర్వాహకులు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. రాజస్థాన్ నుంచి వలస వచ్చిన హోల్సెల్ మొబైల్ సెంటర్ వ్యాపారులు, 300 మంది రిటైల్ మొబైల్, టెక్నీషియన్స్ కుటుంబాల పొట్ట కొట్టే విధంగా రిటైల్ వ్యాపారం చేస్తున్నారన్నారు. షాపులు బందు చేసి శుక్రవారం నిరసన తెలిపారు. నకిలీ వస్తువులు తీసుకువచ్చి జీరో మాల్ తక్కువ ధరలకు అమ్ముతున్నారు.