చలో సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన డివైఎఫ్ఎ నాయకత్వాన్ని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్ డివైఎఫ్ఎ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. డివైఎఫ్ఎ జిల్లా ప్రధాన కార్య దర్శి జతిరుపతి మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువతకు ఉద్యోగ కల్పన చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిందన్నారు. యువతను ప్రభుత్వం మోసం చేసిందన్నారు.