శనివారం రామడుగు మండలంలోని వన్నారం గ్రామానికి చెందిన నిరుపేద ఒంటరి మహిళ గజ్జల లక్ష్మికి హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ తరఫున ఉచిత కుట్టు మిషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతల శ్రీనివాస్ రెడ్డి, సుధ గోని రాజు, హరీష్, పెంటి రాజమౌళి, చిట్కూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. భర్తను కోల్పోయిన లక్ష్మి, తన కూతురికి బ్రెయిన్ సర్జరీ అయ్యిందని, ఈ సమయంలో అండగా నిలిచిన ఫౌండేషన్ అధ్యక్షురాలు హిమజకు కృతజ్ఞతలు తెలిపారు.