సైదాపూర్: దర్గాలో గుప్త నిధుల కోసం తవ్వకాల కలకలం

70చూసినవారు
సైదాపూర్: దర్గాలో గుప్త నిధుల కోసం తవ్వకాల కలకలం
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలోని దర్గాలో శుక్రవారం రాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ చెందిన గౌసియా బేగం, ఆమె కుమారుడు యాకూబ్ పాషా, కోడలు నేహ కలసి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ముస్లిం మత పెద్ద సయ్యద్ సర్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సోమవారం సైదాపూర్ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్