కరీంనగర్ రూరల్ మండలం నల్లగుంటపల్లిలో బుధవారం విద్యావాహిని ప్రచార రథం ద్వారా ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని అవగాహన కల్పించారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.