కరీంనగర్ జిల్లాను చలి గజగజలాడిస్తోంది. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. జిల్లా కేంద్రంలోని గీతాభవన్ చౌరస్తా, బైపాస్ రోడ్, కలెక్టరేట్, రేకుర్తి, వర్క్ షాప్, విద్యా నగర్, భాగ్యనగర్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. చలి తీవ్రతకు కరీంనగర్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.