సిరిసిల్ల పట్టణం సుందరయ్యనగర్ సిక్కువాడకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బల్విర్ సింగ్ -ఇంద్రా కౌర్ కూతురు అంజలి వివాహం సందర్భంగా శనివారం స్థానిక 36వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రాజు 50 కిలోల బియ్యం అందించి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వధువు బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ కల్లూరి రాజు కృతజ్ఞతలు తెలియజేశారు.